30 రోజుల్లో యుద్ధానికి సిద్ధం!

Thursday, December 4, 2025

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న తాజా సినిమా ‘ఘాటి’ పై ఇప్పటికే సినిమాప్రेमుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో బజ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో అనుష్క పోషిస్తున్న పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే స్పష్టమైంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపించగా, రిలీజ్‌కు ఇంకో నెల మాత్రమే ఉందని మేకర్స్ తెలిపారు. అంటే సినిమా జూలై 11న థియేటర్లలోకి రానుందని దీనితో స్పష్టమైంది.

ఇక ఈ చిత్రంలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుండగా, మేకింగ్ క్వాలిటీ పరంగా కూడా మంచి స్టాండర్డ్‌ను పాటిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నాయి.

ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని పెంచిన ఈ సినిమా, విడుదల సమయానికి ఇంకా ఎక్కువ హైప్‌ను అందుకోనుంది. త్వరలో మరిన్ని ప్రమోషనల్ మెటీరియల్ కూడా విడుదల చేయనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles