పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమాపై మళ్లీ హైప్ మొదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాత జ్యోతికృష్ణ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై చాలా కాలంగా వాయిదాలు పడుతున్నా, ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులను మేకర్స్ పూర్తిగా కంప్లీట్ చేశారు. దాదాపు 6000 విఎఫ్ఎక్స్ షాట్లు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్క షాట్‌లో పదికి పైగా లేయర్స్ వుంటాయని సమాచారం. ఇలా చూస్తే, టెక్నికల్ పరంగా ఈ సినిమా ఎంతవారి స్థాయిలో తెరకెక్కించారో అర్థం అవుతుంది.
అయితే వీటిలో క్లైమాక్స్ పార్ట్‌కి ప్రత్యేకంగా మరింత ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఒక్క క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ కోసం మేకర్స్ దాదాపు 25 కోట్లు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఎక్కడా కూడా తక్కువ చేసి చేయకూడదన్న నిబద్ధతతో, ఆఖరి వరకూ ప్రామాణికంగా వర్క్ చేయించారని తెలుస్తోంది.
ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు అంతా ఓ కొత్త రేంజ్‌లో ఉండబోతున్నాయని, ఇది భారత సినీ పరిశ్రమలో మంచి మార్క్ వేసేలా ఉంటుందని యూనిట్ ఆశిస్తోంది. సినిమాకి తగినంత విజువల్ గ్రాండియర్ ఉండేలా చేయాలని మేకర్స్ పెద్ద ఎత్తున కసరత్తులు చేశారు. ఇప్పుడు సినిమా విడుదల తేదీ పట్ల ఆసక్తి మళ్లీ పెరిగిపోతోంది.