మహేష్‌ బాబు డైరెక్షన్‌ లో రామ్‌ పోతినేని!

Andhrawatch
1 Min Read

‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమాకి రంగం సిద్దమైంది.  తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్ పోతినేనితో ఫస్ట్ ఎటెంప్ట్‌ గా  ఓ ఆసక్తికర ప్రాజెక్టుని తెరకెక్కిస్తోంది.

నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ని చేసి, సూపర్‌ హిట్‌  అందుకున్న దర్శకుడు మహేష్‌బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. విజయదశమి సందర్భంగా శనివారం నాడు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. హీరోగా రామ్ పోతినేనికి ఇది 22వ చిత్రం.

నవంబర్ నుంచి ఈ  సినిమా చిత్రీకరణ మొదలుపెడతామని, రామ్ పోతినేనితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ తెలిపారు.కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు.

Share This Article