వైసీపీ నేతలకు తాజా యాత్రాస్థలం రాజమహేంద్రవరం!

Thursday, December 4, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు సరికొత్త యాత్రాస్థలం దొరికింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత.. మహిళలు పోలోమని తీర్థయాత్రకు వెళుతున్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ యాత్రాస్థలం డెస్టినేషన్ లాగా పోలోమని రాజమహేంద్రవరం వెళుతున్నారు. అక్కడ అంత ప్రఖ్యాతమైన ఆలయం ఏముందా? అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడేమీ గోదావరి పుష్కరాలు కాదు కదా అని సందేహించకండి.  వారు వెళుతున్నది ఏదైనా దైవ దర్శనానికి గానీ, పుణ్యాలు ఇచ్చే పుష్కర స్నానాలకు గానీ కాదు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి!! అబ్బెబ్బే.. వారందరూ వెళ్లి జైల్లో చేరడం లేదు. వెళ్లి అక్కడి జైల్లోని మిథున్ రెడ్డిని ములాఖత్ రూపంలో కలిసి పరామర్శించి.. ఆయన గుడ్ లుక్స్ లో పడాలని ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత.. పార్టీలో నెంబర్ టూ స్థానానికి నిత్యం నడుస్తూ ఉండే గేమ్ లో పెద్దిరె
డ్డి కుటుంబం కూడా కీలకం కాబట్టి.. మిథున్ రెడ్డి ములాఖత్ ల కోంస పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు.

మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ దళాలు కాజేసిన లిక్కర్ కుంభకోణంలో.. అరెస్టు అయిన తతిమ్మా నిందితులు అందరి సంగతి వేరు.. ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంగతి మాత్రం వేరు. ఈ కేసులో అరెస్టు అయిన రెండో రాజకీయ నాయకుడు అయన. అదేసమయంలో దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక చట్టసభకు సభ్యుడిగా ఉంటూ.. ఈ లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఏకైక వ్యక్తి. ప్రజాప్రతినిధి గనుక.. ఆయనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించే వెసులుబాటు ఉంటుంది. ఆయన రేంజికి తగ్గట్టుగా ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచారు. మిగిలిన వారంతా గుంటూరు, విజయవాడ జైళ్లలో ఉన్నారు. అదే సమయంలో.. ఎంపీ గనుక.. ఆయనకు ప్రత్యేకంగా ములాఖత్ ల విషయంలో కూడా ఎక్కువ సార్లు కలిసేలా కోర్టు వెసులుబాటు ఇచ్చింది.

ఈ ములాఖత్ లకు అనుమతిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ.. రాజమండ్రి వెళ్లి మిథున్ రెడ్డిని కలవడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు క్యూకడుతున్నారనే చెప్పాలి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరుజిల్లా వరకు నాయకులందరూ దడికట్టి.. ఆయనతో ములాఖత్ కోసం తపన పడుతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలిసి పరామర్శిస్తే.. జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్ లో కూడి పడినట్టు అని వారు మురిసిపోతున్నారు.

నిజానికి మిథున్ రెడ్డి తనకు ఎంతో ఆత్మీయుడు కావడంతో.. రాజమండ్రి వెళ్లి ఆయనను పరామర్శించాలని జగన్ తొలుత అనుకున్నప్పటికీ.. తర్వాతి పరిణామాల్లో ఆ ములాఖత్ ను రద్దు చేసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పెద్దిరెడ్డి వర్గం అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles