ఆమెపై కనికరం చూపే ఉద్దేశం లేని రఘురామ!

Wednesday, December 4, 2024

డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు.. ఒక్క విషయం చాలా గట్టిగానే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తాను వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న రోజుల్లో.. రాజద్రోహం కింద తనను అరెస్టుచేసి, చిత్రహింసలు పెట్టి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసిన వ్యవహారంలో ఎవరెవరైతే పాత్రధారులుగానూ, సూత్రధారులుగానూ ఉన్నారో వారెవ్వరినీ విడిచిపెట్టకూడదని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. ఆ క్రమంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నటువంటి అప్పటి గుంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద ఎలాంటి ప్రత్యేకమైన కనికరం చూపే అవకాశం లేదని తేలిపోతోంది.

ఎందుకంటే.. ఆమె ముందస్తు బెయిల్ కావాలంటూ జిల్లాకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ లో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని, వైద్య బృందం నివేదికల్ని టాంపరింగ్ చేసిన ఆమెకు బెయిలు ఇవ్వవద్దని కోరుతూ రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆమెకు ముందస్తు బెయిలు దక్కకుండా చేయడానికి ఆయన నేరుగానే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.

రఘురామక్రిష్ణ రాజు తన మీద హత్యాయత్నం జరిగిందంటూ పోలీసు కేసు నమోదు చేసినప్పుడు.. ప్రధాన నిందితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు,  గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు ప్రభావతి తదితరులు ఉన్నారు. విజయపాల్ ఇప్పటికే ఒక విడత విచారణను కూడా ఎదుర్కొని, అరెస్టు అయి కటకటాల వెనుక ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

మిగిలిన వారు కూడా ఒక్కరొక్కరుగా అరెస్టు అవుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రభావతి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగం ద్వారా హత్యకు యత్నించిన కుట్రలో ప్రభావతి కూడా భాగస్వామి అని ఆరోపిస్తూ రఘురామ న్యాయవాది తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

రఘురామను పరీక్షించిన వైద్యులు ఆయన రెండు కాళ్ల మీద బలమైన దెబ్బలు ఉన్నాయని, వాచి ఉన్నాయని నివేదిక ఇస్త్తే.. దానిని టాంపరింగ్ చేసి భిన్నమైన నివేదిక ఇవ్వడంలో ప్రభావతి కీలక పాత్ర పోషించారనేది ఆయన ఆరోపణ. రఘురామపై హత్యాయత్నం వ్యవహారంలో త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles