బెయిలుపై బయట ఉండడం ద్వారా.. చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, వారి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సుప్రీం కోర్టు ముఖ్యమంత్రికి లేఖ రాయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కంగారు పుట్టిస్తోంది. బెయిలుమీద బయట ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పదేళ్లుగా బెయిలు మీదనే ఉంటూ.. సీబీఐ ఈడీ కేసుల విషయంలో ఆయన షరతులు ఉల్లంఘిస్తున్నారని పురందేశ్వరి సీజేఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
నిజానికి ఏపీ రాజకీయాల్లో వైసీపీఎంపీ విజయసాయిరెడ్డికి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. పురందేశ్వరి తెలుగుదేశానికి అనుకూలంగా కులరాజకీయాలు చేస్తున్నారంటూ విజయసాయి విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ కు అనుకూలంగా వారి విజయం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నదని, పరోక్షంగా వారికి మద్దతివ్వడం ద్వారా పురందేశ్వరి కుటిల రాజకీయాలు చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని విజయసాయి చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
మరోవైపు అసలు ఆయన బెయిలు రద్దుచేయాలని పురందేశ్వరి సుప్రీం కు లేఖ రాయడం కూడా కీలకమైన సంగతి. ఈ లేఖలో ఆరోపణలను ఆమె కేవలం విజయసాయికి పరిమితం చేయలేదు. సీఎం జగన్ ను కూడా ప్రస్తావించారు. వీరు పదేళ్లుగా బెయిలుపై ఉంటూ.. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోరధిస్తున్నారని ఆరోపించారు. విజయసాయి బినామీలతో డిస్టిలరీలు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు.
అక్కడితో ఊరుకోలేదు. వివేకానందరెడ్డి గొడ్డలితో నరకబడి హత్యకు గురైన కేసులో ప్రెస్ మీట్ పెట్టి.. అది కేవలం గుండెపోటు, సహజమరణం అని ప్రకటించిన మొదటి వ్యక్తి విజయసాయి అని.. ఇలాంటి వారి వల్ల వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. ఇప్పుడు సుప్రీం సీజేఐ , పురందేశ్వరి లేఖను పరిగణనలోకి తీసుకుంటే గనుక.. వైఎస్ జగన్ కు కూడా ఇబ్బంది తప్పదు. ఎందుకంటే.. ఆమె చేసిన ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా వర్తించేవే. ఆయన మీద కూడా ఆమె లేఖలో ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీం ఎలా స్పందిస్తుంది. చిన్నమ్మ పురందేశ్వరి ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
చిన్నమ్మ టార్గెట్ ఏ2కే కాదు, ఏ1 కూ ఇబ్బందే!
Friday, November 15, 2024