సామాన్యులపై దుర్మార్గాలు ఇప్పట్లో ఆగవా?

Wednesday, January 22, 2025

భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నదని రొమ్ము విరిచి చెప్పుకుంటూ ఉండే దేశంలోనేనా మనం ఉంటున్నది అనే సందేహం చాలా తరచుగా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే.. సామాన్యప్రజలు టార్గెట్ గా వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపడం అనేది.. వారిని నియంత్రించడానికి, వారి గొంతు నొక్కడానికి ఒక మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నెగటివ్ పోస్టులు పెట్టినందుకు ఒక సామాన్య మహిళను అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది! ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారినందరినీ జైళ్లకు పంపి.. ప్రభుత్వం ప్రజల్లోకి ఏం సంకేతాలు పంపదలచుకుంటున్నదని ప్రజలు అనుకుంటున్నారు. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానుల నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిచోటా నిరసనలు, ఆందోళనలు, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ వంటివి.. ఏం నిర్వహించడానికి పూనుకున్నా సరే.. అనుమతులు ఇవ్వకుండా పో లీసులు వారిని కట్టడి చేస్తున్నారు. అయితే ఆధునిక తరంలో.. పోలీసుల కట్టడికి ప్రజాగళం మూగపోయే పరిస్థితి లేదు. సోషల్ మీడియా అనేది ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. దీనిద్వారా.. తమ నిరసనలు తెలియజేయడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటోంది. చంద్రబాు అరాచక అరెస్టుకు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 

గుంటూరు విజయపురి కాలనీకి చెందిన శివపార్వతి అనే మహిళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో జగన్ తీరు మీద సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును ఆమె ఫార్వర్డ్ చేశారు. తమ నాయకుడి గౌరవానికి భంగం కలిగించారంటూ గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివపార్వతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. 

అయితే పోలీసుల తీరుమీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఏడేళ్ల కంటె జైలు శిక్ష తక్కువ పడే కేసుల్లో 41ఏ నోటీసులు ఇవ్వకుండా నిందితులను రిమాండుకు పెట్టడం ఏంటి? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదొక ఉదాహరణ మాత్రమే కాగా.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే.. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తున్న వారిమీద పోలీసులు లెక్కకు మిక్కలిగా కేసులతో విరుచుకుపడుతుండడం గమనించాల్సిన విషయం. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు అనేవి ఒక్క చంద్రబాబుకే పరిమితం కావడం లేదని.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరినీ వేధించదలచుకున్నట్లున్నారని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles