మిస్టర్ బచ్చన్‌ కోసం రంగంలోకి పిఠాపురం ఎమ్మెల్యే!

Andhrawatch
1 Min Read

మాస్‌ మహారాజా హీరోగా , మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌ లో వస్తోన్న మాస్‌ యాక్షన్‌ సినిమా మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా అజయ్‌ దేవగన్‌ బాలీవుడ్‌ లో నటించిన రైడ్‌ అఫీషియల్‌ రీమేక్‌ ఈ మిస్టర్‌ బచ్చన్‌. ఆ సినిమా సేమ్‌ టు సేమ్‌ కాకుండా…కేవలం మూల కథను మాత్రమే తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసినట్లు దర్శకుడు ఇటీవలే తెలిపారు.

ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాబోతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ఇంకా  వారం రోజులు మాత్రమే ఉన్నందున బచ్చన్ సాబ్ ప్రమోషన్స్తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్నీ కూడా ఘనంగా నిర్వహించారు.

కాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు బచ్చన్ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు పీపుల్స్ మీడియా సభ్యులు.  ఒకవేళ పవన్ ఒకే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

Share This Article