మరోసారి ఆ దర్శకుడితోనే!

Andhrawatch
1 Min Read

కింగ్‌ నాగార్జున కొత్తవాళ్లను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారనే విషయం తెలిసిందే. ఆయన ద్వారా సినీ ప్రపంచానికి పరిచయం అయిన డైరెక్టర్ల సంఖ్య చాలా పెద్దదే. కొద్ది రోజుల క్రితం  ‘నా సామిరంగ’ సినిమాతో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు నాగ్‌.

ఆ సినిమా సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగ్‌ ‘కుబేర’తో నాగ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున అతిథి పాత్ర పోషిస్తున్నారు. అందులో హీరో ధనుష్‌. అయితే.. హీరోగా నాగ్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనేది అభిమనుల్లో మొదలైన ప్రశ్న.

దానికి సమాధానంగా మళ్లీ విజయ్‌ బిన్నీతోనే ఆయన సినిమా చేయనున్నారట. ఇటీవలే విజయ్‌కి అడ్వాన్స్‌ కూడా ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘నా సామిరంగ’ సినిమా మలయాళం సినిమా రీమేక్‌. మరి ఈసారి సొంత కథతో వెళ్తున్నారని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన ఉంటుందని సమాచారం.

Share This Article