మోడీ బయోపిక్‌ లో నటించలేను..!

Monday, October 14, 2024

భారత ప్రధాని మోడీ బయోపిక్‌ లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటుడు సత్యరాజ్‌ టాలీవుడ్‌ కట్టప్ప తెల్చి చెప్పారు. ఈ విషయం గురించి ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మోడీ బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినా అందుకు ఒప్పుకోనని, కచ్చితంగా దానిని తిరస్కరిస్తానని, తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన సినిమాలో నటించలేనని సత్యరాజ్‌ అన్నారు.

తమిళంలో మోడీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో సత్యరాజ్‌నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యరాజ్‌ ఈ విషయంపై స్పందించారు. ‘ఈ వార్తలు నాకే ఆశ్చర్యం కలిగించాయి. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను మానుకోవాలి. భవిష్యత్తులో మోడీ బయోపిక్‌ కోసం నన్ను ఎవరైనా సంప్రదిస్తే చేయనని చెబుతాను. ఎందుకంటే ఈ సినిమా నా భావజాలానికి, సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది’ అని సత్యరాజ్‌ వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles