కన్నప్పలో నటించడం లేదు..ఎందుకంటే!

Andhrawatch
1 Min Read

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పలో తాను నటించడం లేదని మంచు లక్ష్మి వివరించారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని ఆమె తెలిపారు.  నటుడు అజయ్‌, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’.  తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్..జూన్‌ 14 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో ప్రసారం కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌లో లక్ష్మి మంచు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కన్నప్పలో మీరు నటించడం లేదా? అని అడిగిన ప్రశ్నకు లక్ష్మి మంచు మాట్లాడుతూ… ‘మంచు విష్ణు కన్నప్పలో నేను ఎందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారు. బహుశా నాకు సరిపోయే పాత్ర కన్నప్పలో లేదేమో. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో మంచు మనోజ్‌ కూడా నటించడం లేదు. ఒకవేళ నేను, మనోజ్‌ ఉంటే.. అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది’ అని మంచు లక్ష్మి అన్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్‌ కుమార్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 

Share This Article