చెవిరెడ్డి బెయిలుకు నో.. గమనిస్తున్నావా మిథున్!

Monday, December 8, 2025

ఆ ఇద్దరు నాయకులూ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులే. కాకపోతే.. ఒకరు వసూళ్ల పర్వం మొత్తం పూర్తయని తర్వాత.. అనగా, దోపిడీ మొత్తం పూర్తయిన తర్వాత.. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో తమ పార్టీ వారిని గెలిపించుకోవడానికి అడ్డదారుల్లో ఎలా ఖర్చుపెట్టాలి.. అనే భాగంలో మాత్రమే పాత్రధారి. మరొకరు- అసలు దోపిడీకి అనుకూలంగా కొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన చేయడం దగ్గరినుంచి.. వసూళ్ల నెట్వర్క్ కు మార్గదర్శనం చేయడం దగ్గరినుంచి, నెలవారీ వసూళ్లలో బిగ్ బాస్ కు చేరేవి కాకుండా.. తనవాటాగా ప్రతినెలా పుచ్చుకోవడం దగ్గరినుంచీ అనేక అక్రమాలకు పాల్పడిన నాయకుడు! ఈ ఇద్దరిలో ఎవరు పెద్ద? ఎవరు చిన్న? నేరస్తుడు! ఎవ్వరైనా సరే మొదటి నాయకుడు చిన్న నేరస్తుడు అని అంటారు.

అలాంటి చిన్న నేరస్తుడికే ఇప్పటికే పలుదఫాలుగా బెయిలు పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతుండగా.. పెద్ద నేరస్తుడైన రెండో నాయకుడికి అంత సులువుగా వస్తుందా? ఈ క్లారిటీ గురించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆలోచించుకోవాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో అనేక పర్యాయాలు అయినట్టుగానే.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి బెయిలు కావాలని పెట్టుకున్న తాజా పిటిషన్ ను కూడా హైకోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

లిక్కర్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా అరెస్టు అయిన నిందితులకు బెయిలు ఇచ్చే విషయంలో హైకోర్టు చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటిదాకా దొరికిన నిందితులంతా లోపలకు వెళ్లడమే తప్ప.. బెయిలు పొంది బయటకు వచ్చిన వారు ఒక్కరు కూడా లేరు. మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన ఈ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా అందరూ భావిస్తుండడం.. పైగా దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసు బృందాల వద్ద హైటెక్ ఆధారాలతో సహా అనేక సాక్ష్యాలు బలంగా ఉండడం ఇవన్నీ కలిసి నిందితులకు బెయిలు రాకుండా అడ్డుపడుతున్నాయి.

ఈకేసులో ఇప్పటిదాకా అరెస్టు అయిన వసూళ్ల నెట్వర్క్ కింగ్ పిన్ రాజ్ కెసిరెడ్డి, జగన్ తరఫున ఫైనల్ అథారిటీగా పనిచేసిన ఆత్మీయ అధికారులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ.. ఇంకా ప్రతి నిందితుడు కూడా పలుమార్లు బెయిలుకోసం పిటిషన్లు పెట్టుకున్నారు. ఏ ఒక్కరికీ ఆమోదం లభించలేదు. ఈ కేసులో అరెస్టు అయిన మొదటి రాజకీయ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా పలు బెయిలు పిటిషన్లు వేశారు. ఇప్పుడు వేసినది కూడా రిజెక్టు అయింది.

ఈ నేపథ్యంలో నిన్న గాక మొన్న జైల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిలు లభిస్తుందో లేదో ఆయనే అర్థం చేసుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మాటకొస్తే మిథున్ రెడ్డికి బెయిలు రావడం చాలా కష్టం అని.. ఆయన సుప్రీంలో వేసిన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు విన్న ఎవరికైనా అర్థమవుతుంది. మిథున్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయకుండా అసలు కేసు ఎలా ముందుకు సాగుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అంటే.. మిథున్ ను కస్టడీకి తీసుకుని విచారించే దాకా.. ఆయనకు బెయిలు దక్కదన్నమాట. కానీ.. తాను రిమాండుకు వెళ్లిన రెండో రోజే ఆయన బెయిలు పిటిషన్ మూవ్ చేయడం గమనించాల్సిన సంగతి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles