చేరికల సంగతి తర్వాత,  జారిపోకుండా ఉంటే చాలు!

Wednesday, January 22, 2025

 తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.  రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి సర్కారుకు ప్రత్యామ్నాయం  తామొక్కరమేనని,  ప్రజలందరూ బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని..  తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా ప్రగల్భాలు పలికిన ఆ పార్టీ..  సరిగ్గా ఎన్నికల ముందు  ఒక్కసారిగా చతికిల పడింది.  కేసీఆర్ సర్కారుకు ప్రత్యామ్నాయంగా బిజెపిని ప్రజలు ఇతర పార్టీల నాయకులు నమ్ముతున్నారని అనుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది.  ఇతర పార్టీల నుంచి వచ్చి బిజెపిలో చేరే వారు కనిపించడం లేదు సరి కదా,  బిజెపిలోని పలువురు నాయకులు ఒక్కరొక్కరుగా నెమ్మదిగా జారుకుంటున్నారు.  కనీసం వారిని కాపాడుకోవడంపై పార్టీ దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.

 హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అత్యున్నతర వినాయక మండలి సిడబ్ల్యుసి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అగ్రనేతలందరూ వస్తున్న సంగతి తెలిసిందే.  ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కొందరు కీలక నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 

 భారత రాష్ట్ర సమితికి చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,  మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి శుక్రవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  శనివారం ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  భారతీయ జనతా పార్టీలోని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి,  జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 

 రాజకీయ పార్టీల మారుతున్న బలాబలాలను గమనించినప్పుడు భారత రాష్ట్ర సమితి,  భారతీయ జనతా పార్టీ రెండింటి నుంచి కూడా నాయకులు కాంగ్రెస్ లోకి తరలి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.  నిజం చెప్పాలంటే కెసిఆర్ కు ప్రత్యామ్నాయం కాగలమని చెప్పుకున్న బిజెపికి ఇది ప్రమాదకర సంకేతం.  అదే సమయంలో బిజెపి వైపు చూస్తున్న వారు కూడా లేరు. ఇటీవల అమిత్ షా ఖమ్మం వచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించినప్పటికీ..  ఆ సభలో ఒక్క చేరిక కూడా లేదు.  తెలంగాణ విమోచన దినోత్సవంతో ముడిపెట్టి అమిత్ షా మళ్లీ వస్తున్నారు. . ఇప్పటికైనా పార్టీలో ఎవరైనా వచ్చి చేరే  పరిస్థితి ఉన్నదా అంటే అదీ లేదు.  ఎన్నికల సమీపించిన తరుణంలో కూడా..  కనీసం పార్టీలోకి కొత్త నాయకుల చేరికలను సాధ్యం చేయలేని స్థితిలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కునారిల్లుతోంది.  అందుకే రాష్ట్ర బిజెపి పరిస్థితి అత్యంత ధైర్యంగా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles