కమలానికి కొత్త సారథులు : పురందేశ్వరి, కిషన్ రెడ్డి

Friday, November 22, 2024

భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలకు పార్టీ సారథులను ఒక్కసారిగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన అధిష్ఠానం, తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. కొత్త సారథుల ప్రకటనకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. సోము వీర్రాజును తొలగిస్తున్నట్టుగా ఆయనకు ఫోను చేసి జెపి నడ్డా తెలియజేశారు. అలాగే ముంబాయి యాత్ర నుంచి ఢిల్లీ వెళ్లి నడ్డాను కలిసిన బండి సంజయ్, చర్చల అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత.. ఎక్కువ సమయం తీసుకోకుండానే.. కొత్త సారథుల పేర్లను ప్రకటించేశారు. వీరిద్దరితో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా చీఫ్ లను ప్రకటించడం జరిగింది.

సోముకు బైబై! బండి గుడ్ బై! .. వ్యతిరేకుల పైచేయి!!
తెలుగురాష్ట్రాలకు సంబంధించినంతవరకు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర పార్టీ సారథులకు గట్టి దెబ్బే పడింది. రాష్ట్ర సారథుల పట్ల వ్యతిరేకత కలిగిఉన్న ఇతర నాయకుల మాటదే పైచేయిం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ సారథులను కొన్ని గంటల వ్యవధిలో పక్కకు తప్పించారు. ఏపీలో సోము వీర్రాజును కేవలం ఫోను కాల్ లోనే తప్పించారు.

ఈ రెండు రాష్ట్రాల పరిణామాలను గమనించినప్పుడు.. సారథుల వ్యతిరేకులదే పైచేయి అని స్పష్టం అవుతోంది. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా చాలాకాలంగా పార్టీలో ఉన్న ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకులు పలువురు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి పితూరీలు చెప్పివచ్చిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు అధికార వైసీపీ తో కుమ్మక్కు అయి పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపించారు. జగన్ తో లాలూచీ పడ్డారని పార్టీ వర్గాలే అంటున్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే.. బండి సంజయ్ మీద అలాంటి కుమ్మక్కు ఆరోపణలు లేకపోయినప్పటికీ.. వ్యతిరేకుల లాబీయింగా బాగానే పనిచేసింది. ఈట రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చేసిన ఫిర్యాదులు పనిచేశాయి. చివరికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా.. కిషన్ రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే మీడియాతో చిట్ చాట్ పెట్టి.. బండిపై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.

మొత్తానికి ఎన్నికలకు సిద్ధం చేసే పార్టీలకు బిజెపి కీలకంగా కొత్త సారథులను నియమించడం అనేది బహుధా చర్చనీయాంశం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles