విజయ్‌ చేసిన పనికి నెటిజన్లు…!

Wednesday, January 22, 2025

తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ..ఉప్పెన సినిమా ద్వారా విలన్‌ గా టాలీవుడ్‌ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రతినాయకునిగా తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అగ్ర హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు.

విజయ్‌ కి పెద్దలంటే చాలా గౌరవం.. పెద్దవారు ఎక్కడ కనిపించిన వారికి కచ్చితంగా పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటాడు.  అయితే తాజాగా విజయ్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. శుక్రవారం తమిళనాడులో లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా తొలిదశ పోలింగ్‌ ఈరోజు తో మొదలైంది. కోలీవుడ్‌ స్టార్స్‌ తమ ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ఉదయం నుంచే బారులు తీరారు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో లో కోలివుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్‌లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ ఇవ్వమని అడిగింది. విజయ్‌ నటన అంటే తనకు చాలా ఇష్టమని వివరించింది. ఇక వెంటనే విజయ్‌ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు.

విజయ్‌ వెంటనే ఆమె కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో అక్కడున్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా అది వైరల్‌ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles