ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తరువాత సినిమాని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై అధికారికంగా ప్రకటన చేశారు. ఇక ఈ మూవీతో బన్నీ ఈ సారి పాన్ వరల్డ్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అల్లు అర్జున్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడూ స్టైలిష్ వేర్‌తో కనిపిస్తుంటాడు. అయితే, తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీ-షర్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో బన్నీని ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించగా.. ఆయన వేసుకున్న టీ-షర్ట్‌పై బ్రహ్మానందం నటించిన ఓ సినిమాలోని ఫోటోలు ఉండటం.. ఆ క్యారెక్టర్ పేరును బన్నీ టీ-షర్ట్ పై చూసి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మీమర్స్‌కు ఎంతో ఇష్టమైన ‘‘నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా’’ ఫోటోలు మనకు బన్నీ టీ-షర్ట్ పై కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలను నెట్టింట అభిమానులు వైరల్ చేస్తున్నారు. బన్నీ కూడా బ్రహ్మీ డై హార్డ్ ఫ్యాన్ అంటూ మీమర్స్ ఈ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
