“హిట్ 3” కి భారీ ఓపెనింగ్స్‌!

Friday, July 11, 2025

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ‘హిట్’ చిత్రం హిట్ 3 కోసం అందరికీ తెలిసిందే. శైలేష్ కొలను ప్లాన్ చేసిన క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూడో మూవీగా వచ్చిన ఈ సినిమాకి ఇపుడు మంచి స్పందన లభిస్తుంది. మరి ఇలా లేటెస్ట్ గా బుకింగ్స్ పరంగా కూడా రికార్డులు ఈ చిత్రం సెట్ చేస్తుంది.

నాని కెరీర్లోనే హైయెస్ట్ గా బుక్ మై షోలో గత 24 గంటల్లో 2 లక్షల 72 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి బుక్ అయినట్లు సమాచారం. ఇక టాక్ కూడా మంచి పాజిటివ్ గా రావడంతో ఈ వీకెండ్ కి భారీ నంబర్స్ ని హిట్ 3 అందుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. మరి చూడాలి హిట్ 3 ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది. ఇక ఈ చిత్రంలో అడివి శేష్ అలాగే కోలీవుడ్ నటుడు కార్తీ సాలిడ్ క్యామియోలలో కనిపించిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles