రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వ్యవహారాల్లో నెల్లూరు లేడీ డాన్ బాగోతం కూడా ఒకటి. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వెయ్యి గొడ్లను తిన్న రాబం ఒక గాలివానక పోయిందని సామెత చెప్పినట్టుగా.. అనేకానేక అరాచకాలు బెదిరింపులు, సెటిల్మెంట్లు, హత్యల వెనుక పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటరు శ్రీకాంత్, ఈ అన్ని నేరాల వెనుక కీలక భాగస్వామ్యం ఉన్నట్టుగా ప్రచారంలో ఉన్న అతని ప్రియురాలు అరుణ ఒక చిన్న కేసులో ఇవాళ జైలు పాలయ్యారు. ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమె జైలుకు వెళ్లారు.
హత్య కేసులో నిందితుడు రౌడీషీటరు శ్రీకాంత్ కు ఇటీవల పెరోల్ లభించినప్పటినుంచి వివాదం రేగుతోంది. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంటుతో పాటు, తిరుపతి జిల్లా ఎస్పీ కూడా అతడి పెరోల్ ను వ్యతిరేకిస్తూ సిఫారసు ఇచ్చారు. ఇద్దరు ఐపీఎస్ లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా.. లేడీ డాన్ అరుణ అమరావతిలో చక్రం తిప్పి.. హోంశాఖలోని ఒక ఉన్నతాధికారి ద్వారా ఒత్తిడి చేయించి.. మొత్తానికి పెరోల్ వచ్చేలా చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు పెరోల్ కోసం సిఫారసు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం బట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యేనే అని తెలుస్తోంది. ఆయన సరిగ్గా ఎన్నికలకు ముందే తెలుగుదేశంలోకి వచ్చారు.
అయితే లేడీ డాన్ నిడిగుంట అరుణ, ఆమె ప్రియుడు రౌడీషీటరు శ్రీకాంత్ ల దందాలు, సెటిల్మెంట్లు అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలోనే శృతిమించి సాగినవైనం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. తెలుగుదేశం ఎమ్మెల్యే పెరోల్ కు సిఫారసు లేఖ ఇచ్చినట్టుగా వార్తలు రావడంతో జగన్ దళాలు రెచ్చిపోయి శ్రీకాంత్ మరియు అరుణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించాయి. అయితే ఈలోగా అరుణ కూడా తన ఫేస్ బుక్ పోస్టులో.. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లంతా ఇప్పుడు మాట్లాడడం లేదని.. ఇలాగైతే తాను నోరు తెరవాల్సి వస్తుందని.. బెదిరిస్తున్నట్టుగా పోస్టు పెట్టారు. ఆమె బెదిరింపులు వైసీపీ నాయకులను ఉద్దేశించే అని పుకార్లు వినవస్తున్నాయి. వైసీపీ నాయకులతో గాఢమైన అనుబంధంతో పాటు.. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా తెరవెనుక సంబంధాలు నడుపుతూ… నిడిగుంట అరుణ- శ్రీకాంత్ లు విచ్చలవిడిగా నేర సామ్రాజ్యాన్ని నడుపుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఐపీఎస్ లను హనీట్రాప్ ద్వారా లొంగదీసుకుని అరుణ ఇంతగా రెచ్చిపోతూ.. తను అనుకున్నది చేయించుకున్నట్ట్టుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలోనే ఆమెను దిశ కౌన్సిలింగ్ లోనూ నియమించిన వైనం కూడా బయటకు వస్తోంది. ఇప్పుడు కూడా అరుణకు అనుకూలంగా ఉండేలా.
