మరోసారి రెమ్యూనరేషన్‌ పెంచిన నేషనల్‌ క్రష్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. హిట్ల మీద హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా సినిమాకి వెరియేషన్‌ చూపిస్తూ తన టాలెంట్‌ ను చూపిస్తూ చాలా తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగిపోయింది.

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం యానిమల్‌ సినిమాతో అటు బాలీవుడ్‌ లో కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాతో పాన్ ఇండియా బ్యూటీ అయ్యింది.. గత ఏడాది చివర్లో విడుదలైన యానిమల్ సినిమా జనాలను మెప్పించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ అమ్మడు వరుస సినిమాలు సక్సెస్ అవుతుండటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను దాదాపు నాలుగు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. యానిమల్ సక్సెస్ తో తన పారితెషకాన్ని మరింత పెంచేసిందట.. రానున్న రోజుల్లో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles