సాలిడ్ స్టార్ తో నాని! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో యువ నటుడు హర్ష రోహన్ మరో ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రమే “కోర్ట్”. మరి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ గ్రాండ్ పైడ్ ప్రీమియర్స్ కూడా జరుపుకొని నేడు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి వచ్చింది.
అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ స్టార్ట్ ని అందుకోవడం విశేషం. అక్కడ ఈ సినిమాకి జస్ట్ ప్రీమియర్స్ తోనే లక్ష 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టడం గమనార్హం. దీనితో యూఎస్ మార్కెట్ కోర్ట్ చిత్రానికి ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.