‘హిట్-3’ కోసం మ‌రొక అవ‌తారంలోకి నాని..?

Tuesday, December 24, 2024

నేచుర‌ల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న ‘స‌రిపోదా శ‌నివారం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ముగించుకుని, ఈ సినిమాను విడుదల కు రెడీ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా, అందాల భామ ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ సినిమా త‌రువాత నాని త‌న హోం బ్యాన‌ర్ వాల్ పోస్ట‌ర్ సినిమా లో ‘హిట్-3’ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాల‌ను అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో  ‘హిట్-3’ పై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ద‌ర్శకుడు శైలేష్ కొల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం నాని కేవ‌లం హీరోగానే కాకుండా మ‌రో అవ‌తారం కూడా ఎత్తినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ను నాని స్వ‌యంగా రాసుకున్నాడని సమాచారం.

ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నుకు త‌న స్టోరీలైన్ వినిపించి పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని నాని చెప్పినట్లు తెలుస్తుంది.  ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉండ‌టంతో మూవీ షూటింగ్ను సెప్టెంబ‌ర్ లో స్టార్ట్ చేసేందుకు నాని సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని ‘అర్జున్ స‌ర్కార్’ అనే ప‌వ‌ర్ఫుల్ కాప్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles