పోలవరం భద్రతపై మరింత దృష్టి!

Thursday, April 3, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమైనవో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. వాటి ప్రాధాన్యం తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయిదేళ్లలో ఆ రెండింటినీ సర్వనాశనం చేసి, ప్రజాగ్రహానికి దిగిపోయారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయవలసిన బాద్యతను స్వీకరించిన కూటమి ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టు భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఒకటికి నాలుగుసార్లు కేంద్రం జలశక్తి నిపుణులను, విదేశీ నిపుణులను సంప్రదించి.. వారంరది సలహాలు సూచలను పరిగణనలోకి తీసుకుంటూ.. ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న నేపథ్యంలో తాజాగా డి ఆకారంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మంచడానికి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. పాత గుత్తేదారుతోనే.. అదనంగా పెరిగిన పనికి అదనంగా చెల్లిస్తూ పనులు చేయిస్తారు. అప్పటికే జగన్ నిర్వాకం వలన రాష్ట్రప్రభుత్వంపై 596 కోట్లరూపాయల భారం అదనంగా పడుతోంది. భారం సంగతి అటుంచితే భద్రత కూడా ఎంతో కీలకంగా పరిగణించాల్సిన అంశంగా మారుతోంది.

ఇప్పటికే విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది. తాజాగా మళ్లీ విదేశీ నిపుణులను రప్పిస్తున్నారు. ఇద్దరు నిపుణులు నేరుగా ప్రాజెక్టు వద్దకు వచ్చి పనుల తీరును, నిర్మాణ నాణ్యతను పరిశీలిస్తారు. మరో ఇద్దరు నిపుణులు చర్చల్లో ఆన్ లైన్ మోడ్ లో పాల్గొంటారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టును ఈ పదవీకాలంలో పూర్తిచేయాలనే కృతనిశ్చయం మాత్రమే కాదు.. మరింత సురక్షితంగా నిర్మించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పె డుతోంది.

చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా చురుగ్గా పోలవరం పనులు నడిపించారు. ప్రతి సోమవారం- ‘పోలవారం’ అని ప్రకటించి.. ఆ రోజుల్లో ప్రాజెక్టు పురోగతి కూడా ఆయన క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించేవారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే, రియల్ టైంలో వారు చెబుతున్న వివరాలను ప్రాజెక్టు వద్ద డ్రోన్ వీడియోల నుంచి తెప్పిస్తున్న ఫుటేజీని లైవ్ లో పరిశీలిస్తూ ఆయన పనులను ఫాలో అప్ చేశారు. అంత శ్రద్ధగా ప్రతి పనినీ ఫాలో అప్ చేయడం వల్ల మాత్రమే.. అప్పట్లో 70 శాతం పనులు పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది పోలవరానికి శాపంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ పరిస్థితులు కూడా మారుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles