శెభాష్.. అన్నాబత్తుని వారి అతితెలివి!

Friday, December 27, 2024

తెనాలిలో సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ ఒక ఓటరుపై చేయిచేసుకుని కొట్టడం, ఓటరు చేతిలో చెంపదెబ్బ తినడం.. తన అనుచరులతో దాడిచేయించి.. ఆ ఓటరును విచక్షణా రహితంగా కొట్టించడం అనే చర్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. పోలింగ్ పర్వంలోని అత్యంత కీలక సంఘటనల్లో అది కూడా ఒకటి. ఓటరును కొట్టిన పర్యవసానంగా ఈసీ ఆగ్రహానికి గురైన అన్నాబత్తుని శివకుమార్ ను పోలింగు ముగిసేవరకు గృహనిర్భంధం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓటరును కొట్టిన తర్వాత అన్నాబత్తుని శివకుమార్ తన చర్యలను సమర్థించుకున్న తీరు ఇంకా చిత్రంగా ఉంది.
‘ఐతానగర్ లో నేను నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తాం ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాషలాడాడు. వైఎస్సార్సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు. పోలింగ్ బూత్లోకి వెళ్లటప్పుడు. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ‘నువ్వు అసలు కమ్మొడివేనా? అంటూ నన్ను దూపించాడు.
“పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్లో ఉదయం నుండి అతడు హల్‌చల్ చేస్తున్నట్లు అక్కడ ఓటర్లే చెప్పారు. టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను దింపారు. వాళ్ల ద్వారా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై “దారులు చేయిస్తున్నారు అని శివకుమార్ ఆరోపించారు.
శివకుమార్ మాటలు ఎంత తలాతోకాలేకుండా, అర్థరహితంగా ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఆయన మాటలు ఇంకా అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి..
1) ఓటరు తనను తిట్టాడని అంటున్న శివకుమార్, తిట్టిన ప్రతి వ్యక్తినీ కొట్టేస్తాడా? కొడితే- ఎదుటివారు తన చేతి దెబ్బలు తినేసి మౌనంగా ఉండిపోవాలని కోరుకున్నారా? తిరిగి కొట్టినందుకు తన అనుచరులైన గూండాలతో చితక్కొట్టిస్తారా?
2) తాను ఒక ఓటరు మీద దాదిచేసి ఈ వ్యవహారంలోకి మాలమాదిగలను లాగుతున్నారు శివకుమార్. అత్యంత హేయమైన చర్య ఇది. మాలమాదిగల పేరు చెబితే… కేసు అటు మళ్లుతుందని.. ఇన్నాళ్లుగా తమ పదవీకాలంలో తమ పార్టీ వారు, ప్రత్యర్థులపై నమోదు చేయించిన దొంగకేసుల్లాగా దీనిని కూడా తిప్పవచ్చునని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది.
3) గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి బెంగుళూరులో ఉన్నాడట. కమ్మవాడట. అసలు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల్ని ప్రోత్సహించి అందరికీ ఇక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశం కల్పిస్తే.. సుధాకర్ వంటివాళ్లు బెంగుళూరు ఎందుకు వెళ్తారు. జగన్ ప్రభుత్వ చేతగానితనం వల్లనే కదా.. చదువుకున్న వాళ్లు వలసలు వెళుతున్నారు.
4) సుధాకర్ బూత్ వద్ద హల్‌చల్ చేస్తున్నట్టుగా ఓటర్లు చెప్పారట. ఓటర్లు ఎవరి మీద చెప్పినా సరే.. ఎమ్మెల్యే వెళ్లి వాళ్లను కొట్టేస్తాడా? ఎక్కడ హల్చల్ చేసేవారినైనా తన అనుచరులతో గుంపుగా వెళ్లి దాడిచేసి కొట్టడానికే తనకు ఎమ్మెల్యే పదవి ఉన్నదని శివకుమార్ అనుకుంటున్నారా?
5) టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడినుంచో మనుషుల్ని దింపారట. ఏంటీ అర్థంలేని ఆరోపణ. ఇతర ప్రాంతాల్లో సెటిలైన వాళ్లు ఓటు వేయడానికి స్వస్థలానికి రానే కూడదా? పెద్దిరెడ్డి వేయించే తరహాలో బయటివారిని తెచ్చి దొంగఓట్లు వేయించడం లేదు కదా. గొట్టి ముక్కల సుధాకర్ అక్కడివాడే కదా. బెంగుళూరు నుంచి ఓటు వేయడానికి రావడం అతను చేసిన పాపమా? నేరమా?
6) బయటినుంచి తెప్పించిన మనుషులతో వైసీపీ ఎమ్మెల్యేల మీద దాడులు చేయిస్తున్నారట. ఇది ఇంకా కామెడీగా ఉంది. దాడిచేసి కొట్టింది.. తొలుత శివకుమారే. తిరిగి మనుషుల్ని తెప్పించి ఎమ్మెల్యేల్ని కొట్టిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి చెత్తసంఘటన అదొక్కటేజరిగింది.. వైసీపీ ఎమ్మెల్యేలందరినీ కొట్టేస్తున్నట్టుగా శివకుమార్ చెప్పడమే కామెడీ.

మొత్తానికి శివకుమార్ తాను చేసిన దాడిని సమర్థించుకునే ప్రయత్నంలో మరింతగా ఆ నేరంలో కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారో ఏమిటో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles