గ్లోబల్ స్థాయిలో తెలుగు సినీ హీరోల ప్రతిష్ఠను మరింతగా పెంచుతూ రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. లండన్‌లోని ప్రసిద్ధ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని అతి త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ విశేషాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ వేడుకలో పాల్గొనడానికి మెగా ఫ్యామిలీ మొత్తం లండన్‌కి బయలుదేరింది. చిరంజీవి, సురేఖతో పాటు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారా కూడా లండన్‌కి వెళ్లారు. మ్యూజియంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రామ్ చరణ్ జీవితంలో మరో స్పెషల్ మైలురాయిగా నిలవనుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఎంతటి గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను గుర్తుగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ప్రెస్టీజియస్‌గా మారింది.
ఇలాంటి గౌరవం వరుసగా మన తెలుగు తారలకూ రావడం అభిమానులకు గర్వకారణంగా మారింది. ఇక రామ్ చరణ్ విగ్రహాన్ని చూసేందుకు మ్యూజియానికి వెళ్లే అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది.ఈ ఘనతతో రామ్ చరణ్ మరోసారి తన స్థాయిని ప్రపంచానికి చూపించాడని చెప్పొచ్చు.
