ఏంటి సాయి ధరమ్ తేజ్ తో ..నిహారిక … కార్డు షేర్‌ చేసిన మెగా డాటర్‌!

Wednesday, January 22, 2025

మెగా ఇంటి వారసురాలు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ సమయంలోనే చైతన్యతో పెళ్లి కాగా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత  ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే సినీ రంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

అంతేకాకుండా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్‌గా కూడా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా.. ఫుల్ బిజీ అయిపోయింది.ఇటీవల చెఫ్ మంత్ర అనే షోలోనూ యాంకర్‌గా కొనసాగుతుంది.

ఈ షోకి సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని పిలిచి అలరిస్తుంది.  అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అభిమానులను తన వైపునకు తిప్పుకునేలా చేసుకుంటుంది. తాజాగా, నిహారిక ఓ కార్డ్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. అచ్చం పెళ్లి కార్డులా ఉంది.

 కానీ అది పెళ్లి కార్డు కాదు. ఓ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేయడానికి అలా వెరైటీగా ప్రింట్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా సాయి ధరమ్ తేజ్‌ గెస్ట్‌గా.. దీనిని ప్రకటించబోతున్నాడు. ఆ కార్డులో  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్‌ఆర్ డీ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడక్షన్స్-1 స్టార్ట్ కాబోతుంది. దీనిని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో  సినిమా నామకరణ మహోత్సవం. వేదిక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అని ఉండగా.. భోజనాలు ఎవరింట్లో వాళ్ళు.. తేదీ ఏప్రిల్ శ్రీకోధ్రి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన సమయం మధ్యాహ్నం 12 గంటలకు అని తెలిపింది.

అలాగే ఆవిష్కకరణ కర్త గా సాయి ధరమ్ తేజ్ ఫొటో ఉండగా.. ధర్మ కర్త దగ్గర నిహారిక ఫోటో ఉంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే తొందరలో రెండో పెళ్లి గురించి కూడా అనౌన్స్‌మెంట్ కూడా వెరైటీగా చేస్తుందోమోనని చర్చించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles