ఆ రేంజ్‌ లో ప్లాన్‌ చేసిన లెక్కల మాస్టర్‌!

Wednesday, January 22, 2025

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ సర్కిల్స్‌తో పాటు అభిమానులు పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.. ఈ సినిమాకు క్లైమాక్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడంట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ ‘పుష్ప-3’కి లీడ్‌లా ఉండబోతుందనే వార్త వినిపించగా.. ఇప్పుడు ఈ లీడ్‌ని ఏకంగా ‘బాహుబలి’ తరహాలో ప్లాన్ చేశాడట సుకుమార్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? అనే రేంజ్‌లో పుష్ప-2 క్లైమాక్స్ ఉండబోతుందని టాక్. ఈ క్లైమాక్స్‌లో ఓ స్టార్ యాక్టర్ ప్రమేయం కూడా ఉంటుందనే టాక్‌ నడుస్తుంది.

మరి నిజంగానే పుష్ప-2 క్లైమాక్స్‌లో ఓ స్టార్ యాక్టర్ నటిస్తాడా.. లేక కేవలం వాయిస్ ఓవర్‌తో మేనేజ్ చేస్తాడా అనేది మాత్రం చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ 5న పుష్ప-2 బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రాబోతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles