ఇక మిగిలింది ఇవే!

Thursday, December 5, 2024

టాలెంటెడ్‌ దర్శకుడు శేఖర్ కమ్ముల తీర్చిదిద్దుతున్న ప్రెస్టీజియస్ సినిమా‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జునతో పాటు తమిళ హీరో ధనుష్ కూడా నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు దీంతో ఈ చిత్ర షూటింగ్ ఏ దశలో ఉందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని.. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

ఒక సాంగ్‌ని ముంబైలో షూట్ చేయబోతున్నారని.. మరో పాటని హైదరాబాద్‌లో షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2025 ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles