యువరాజును కనుగొనడానికి కప్పలను ముద్దాడా!

Wednesday, December 25, 2024

స్టార్‌ నటి తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఝుమ్మంది నాదంతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత స్టార్ హీరోల పక్కన నటించి మంచి మార్కులే కొట్టేసింది. యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ తో కలిసి నటించిన మిస్టర్‌ పర్ఫెక్ట్ సినిమాకి అయితే ఒక్కసారిగా స్టార్ నటీమణుల జాబితాలో చేరిపోయింది.

అయినప్పటికీ తెలుగులో పెద్దగా ఆఫర్లు తలుపుతట్టకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.  అక్కడ కొత్త కొత్త  పాత్రలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. తాజాగా తాప్సీ డుంకీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆమె వ్యక్తిగత విషయాల విషయానికి వస్తే.. తాప్సీ బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోయ్‌ తో డేటింగ్‌ లో ఉందనే వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

గత నెలలో ఉదయ్ పూర్‌ లో వీరి పెళ్లి రహస్యంగా జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం… తాప్సీ, సంగీత్‌ పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్  అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఓ సందర్భంలో  కప్పలను ముద్దు పెట్టుకున్నట్టు తెలిపి షాకిచ్చింది.

‘‘నేను యువరాజును కనుగొనే ముందు చాలా కప్పలను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందని…. నేను పరిపక్వత చెందిన తర్వాత, నాకు కావాల్సింది అబ్బాయి కాదు, మనిషి అని అర్థం అయింది. ఇందులో చాలా తేడా ఉంది. అర్థం చేసుకునే వ్యక్తి మాత్రమే సంబంధంలో నేను కోరుకున్న భద్రత, స్థిరత్వాన్ని అందించగలరని నిర్ణయించుకున్నారు.అప్పుడే డిసైడ్ అయ్యా నాతో పడాలంటే అబ్బాయి కాదు.. మగాడు అయ్యి ఉండాలని. ఊరికే ఎమోషనల్ అయిపోయి, ఏడ్చేవాళ్ళు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు నాకు నచ్చరు. అలాంటి వాళ్ళు ఉంటే నాపై, నా కుటుంబంపై వాళ్ల ఎఫెక్ట్ పడుతుంది. ఆ ప్రభావం నా పనిపై కూడా చూపిస్తుంది. అందుకే నా జీవితానికి సంబంధించిన విషయాలపై నేనే నిర్ణయం తీసుకుంటా’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles