కన్నడ నుంచి వచ్చిన పెద్ద హిట్ కాంతారకి ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార 1పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. అయితే అమెరికా మార్కెట్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం అక్కడి షోస్ రద్దయినట్టుగా తెలుస్తోంది.
నార్త్ అమెరికాలో ఐమ్యాక్స్ వెర్షన్ డెలివరీలో ఆలస్యం రావడంతో అక్కడి ప్రీమియర్‌లు ఆగిపోయాయని చెబుతున్నారు. ఈ కారణంగా ఐమ్యాక్స్ కోసం వెయిట్ చేయకుండా అందుబాటులో ఉన్న ఇతర షోస్‌ను చూడాలని డిస్ట్రిబ్యూటర్స్ సూచిస్తున్నారు.
