టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారీ స్థాయి నటీనటులు పాల్గొనడం వల్ల రిలీజ్ ముందు నుంచే మంచి క్రేజ్ ఏర్పడింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు వంటి స్టార్ నటులు ఇందులో కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మొదట రోజు నుంచే పాజిటివ్ టాక్ సాధించింది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం అంచనాలకు తగ్గ రీతిలో రాణించలేకపోయింది. అయినా కూడా సినిమాపై ఆసక్తి మాత్రం తగ్గలేదు.
ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ల తర్వాత ఓటీటీలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు.
