క్రేజీ పోస్టర్‌ తో కంగువా..!

Sunday, December 22, 2024

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశా పటానీ హీరోయిన్ గా డైరెక్టర్‌ శివ రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా సినిమా కంగువా. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇది ఒక్క సూర్య కెరీర్ లోనే కాకుండా టోటల్ తమిళ సినిమా నుంచి కూడా ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాని కూడా మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ని మూవీ మేకర్స్ తాజాగా అభిమానులకు అందించారు.

దీంతో ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా రెండు నెలల ముందే విడుదల చేస్తున్నట్టుగా సాలిడ్ అప్డేట్ అందించారు. జనరల్ గా ఏ భారీ సినిమా అయినా ఇప్పుడు ట్రెండ్ లో సరిగ్గా ఒక్క నెల ముందు ట్రైలర్ ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం రెండు నెలల ముందే ట్రైలర్ వదులుతుండడం ఓ విశేషం.

ఇక ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతుండగా.. దీనికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగా ఈ ఆగస్ట్ 12న ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టుగా సూర్యపై ఒక పవర్ఫుల్ పోస్టర్ తో అభిమానుల ముందుకు వచ్చారు. ఇది మాత్రం క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. సూర్య తన సాలిడ్ మేకోవర్ లో కనిపిస్తుండగా తన వెనుక ఉన్న రెండు రెక్కలతో యూనిక్ గా ప్రెజెంట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles