రాజాసాబ్‌ సినిమా పై ఇంట్రెస్టింగ్‌ వార్త చెప్పిన ప్రొడ్యూసర్‌!

Saturday, December 7, 2024

పాన్ ఇండియా యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన తాజా సినిమా “కల్కి 2898 ఏడీ” తో ఒక సూపర్‌ డూపర్ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి విడుదల కి వచ్చే సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు మారుతీతో చేస్తున్న “ది రాజా సాబ్” అని చెప్పుకోవచ్చు.

మరి ఈ సినిమాని మేకర్స్ ఒక హార్రర్ ఫాంటసీ వండర్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ది రాజా సాబ్ సినిమా అందరూ అనుకుంటున్నా దానికంటే చాలా పెద్ద సినిమా అని రాబోయే రోజుల్లో వచ్చే కంటెంట్ చూస్తే ఇది అందరికీ అర్ధం అవుతుందని ఆయన అన్నారు.

అలాగే ఈ చిత్రం చాలా పార్ట్ వరకు గ్రాఫిక్స్ తోనే కనిపిస్తుందని ఇంకా చాలా అంశాలు సినిమాలో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని తాను తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమాతో కూడా కేజ్రీ ట్రీట్ రాబోతుంది అని చెప్పుకొవచ్చు.. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles