త్వరలో వచ్చేస్తున్న కాంచన 4

Sunday, December 22, 2024

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్‌ హిట్‌ అయిన సినిమాల్లో కాంచన ఒకటి. ఈ సినిమాకి  కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్‌  హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ముని, కాంచ‌న 2, కాంచ‌న 3 చిత్రాలు హార్రర్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో ఓ  ట్రెండ్‌ని క్రియేట్‌ చేశాయి.

ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దాని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా లారెన్స్‌ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. కాంచ‌న 4 ను డైరెక్టర్ రాఘవ లారెన్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుదల చేశారు.

రాఘ‌వ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న కాంచ‌న 4 సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్లు సమాచారం. 2025 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘ‌వ లారెన్స్, కోవై సరళల కామెడీ ఈ సినిమాలల్లో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలలో వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు కథానాయికలుగా నటించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles