కల్కి సినిమాలో రౌడీ హీరో!

Tuesday, January 21, 2025

ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని పాన్‌ వరల్డ్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన, దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే.

వీరితో పాటు అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరోలైన అమితాబ్‌, కమల్‌ వంటి దిగ్గజ నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

మరో నాలుగు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుంది. సినిమా థియేటర్లలోకి రాబోతున్న క్రమంలో సినిమా నుంచి ఒక్కో క్యారెక్టర్‌ ను రివీల్ విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా అదిరిపోయే పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

అశ్వద్దామగా నటిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌ పై పోరాడే సన్నివేశాల్లో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్‌ పాత్ర గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ప్రకటించలేదు. విజయ్‌ పాత్ర సస్పెన్సుతో ఉండాలని ఎక్కడా కూడా ఆ పాత్ర లీక్‌ కాకుండా చిత్ర బృందం జాగ్రత్తపడినట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles