అంజూయాదవ్‌పై జనసేన ప్రెవేటు కేసు!

Sunday, December 22, 2024

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుడు కొట్టే సాయి మీద స్థానిక సీఐ అంజూయాదవ్ చేయి చేసుకోవడం, రెండు చెంపలపై కొట్టడం అనేది ఇప్పుడు బహుధా వివాదాస్పదం అవుతోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో తన దూకుడుకు ముద్రపడిన ఈ మహిళా సీఐ అప్రజాస్వామిక తీరుపై జనసేన పార్టీ ఇప్పుడు ప్రైవేటు కేసు ద్వారా కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.

వాలంటీరు వ్యవస్థ ద్వారా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాల గురించి పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం రాష్ట్రమంతా సంచలనం రేకెత్తించిన వైనం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీనేతలు, వాలంటీర్లు శ్రీకాళహస్తిలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దానికి ప్రతిగా శ్రీకాళహస్తిలోని జనసేన నాయకులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి పూనుకున్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సీఐ అంజూయాదవ్.. పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, మహేష్ తదితరులు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో సీఐ అంజూయాదవ్.. జనసేన నేత కొట్టే సాయిని రెండు చెంపలు వాయించేశారు.

గతంలో నిరుపేదల పట్ల కూడా చాలా దూకుడుగా వ్యవహరించిన చరిత్ర సీఐ అంజూయాదవ్ కు ఉంది. కాళ్లతో తన్నడం వంటి పనులతో ఆమె వార్తల్లో వ్యక్తి అయ్యారు. 

సీఐ అరాచకవైఖరిపై ఇప్పుడు కోర్టులో ప్రైవేటు కేసు వేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా పోలీసులకు ఎవ్వరిని కూడా కొట్టడానికి హక్కు ఉండదు. అలాంటిది ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి మీద బహిరంగంగా అందరూ చూస్తుండగానే.. ఆ చెంపా ఈ చెంపా వాయించి కొట్టడం అనేది ఆమె దురహంకారానికి నిదర్శనం అని పార్టీ భావిస్తోంది. గతంలో రోడ్డు పక్కనదుకాణాలు పెట్టుకున్న వారిని కూడా కాళ్లతో తన్నిన ట్రాక్ రికార్డు అంజూయాదవ్ కు ఉంది. ఆ దృష్టాంతాలను కూడా పేర్కొంటూ.. ఆమె దూకుడు వైఖరిపై కోర్టులో ప్రెవేటు కేసు వేయబోతున్నారు.

సాధారణంగా పోలీసుల మీద ప్రెవేటు కేసు దాఖలైతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి సందర్భాలలో సదరు కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా సదరు అధికారులు పెట్టిన వారిని బతిమిలాడే పరిస్థితి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంజూయాదవ్ దూకుడుకు కళ్లెం వేయడానికి జనసేన నాయకులు ప్రెవేటు కేసు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles