చైన్నైలో జైలర్‌ 2!

Thursday, April 3, 2025

చైన్నైలో జైలర్‌ 2! సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా ‘జైలర్‌ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ నేడు చెన్నైలో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్ తర్వాత ఏప్రిల్‌ లో రెండో షెడ్యూల్ మొదలుకాబోతుంది. కాగా ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘టైగర్‌ కా హుకూమ్‌’ అంటూ ‘జైలర్‌’లో హంగామా చేసిన రజనీకాంత్‌, ‘జైలర్ 2’లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles