హిందీలోకి డ్రాగన్!

Thursday, March 27, 2025
హిందీలోకి డ్రాగన్! తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కథానాయికులుగా యాక్ట్‌ చేశారు. ‘ఓరి దేవుడా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ మూవీకి డైరెక్షన్‌ వహించారు.

తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు చోట్లా బాగానే హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు హిందీలో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరి తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించినట్లుగానే.. హిందీలో కూడా ఈ చిత్రం విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి. కాగా ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, న బాలీవుడ్‌లో విడుదల అవ్వనుంది. ప్రేమ, కాలేజ్ జీవితం, కాలేజ్ తర్వాత విద్యార్థుల జీవితాలు వంటి అనేక ఇతివృత్తాలతో కూడిన చిత్రం ఇది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles