హిందూ ఓట్ల భయంతో జడుసుకున్న జగన్!

Friday, December 20, 2024

ప్రతి ఏటాసుమారు రెండువేల కోట్ల రూపాయల పైచిలుకు హుండీ ఆదాయం ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి  వైభవం చూస్తే  సాధారణంగా ఎవరికైనా గౌరవం కలగాలి.  కానీ ఆ నిధుల మీద ఆశ పుడితే ఇబ్బందే.  వేలకోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రకటించేసి..  అనుచితమైన రీతిలో ప్రజల జేబుల్లోకి డబ్బులు పంచిపెట్టడమే..  వారికి చేస్తున్న మేలు అనే ఆత్మవంచనతో పరిపాలన సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..  ప్రతినెలా ఎక్కడెక్కడ నుంచో అప్పులు తీసుకువస్తే తప్ప..  ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.  ఇలాంటి సమయంలో తిరుమల దేవుడి నిధులను కూడా వాడుకోవాలని ఆలోచన పుట్టడం సహజం.  అయితే అలాంటి పనికి తెగిస్తే గనుక..  హిందువుల ఓట్లు తనకు శాశ్వతంగా దూరమవుతాయని భయం జగన్మోహన్ రెడ్డిలో పుట్టినట్టుగా కనిపిస్తుంది.  అందుకే స్వామివారి నిధులను వాడుకోవడానికి అటువైపు నుంచి ఆఫర్ వచ్చినా కూడా ఆయన దానిని వద్దనుకున్నారు.  తిరుపతి మునిసిపాలిటీ అభివృద్ధి పనుల కోసం..  ఏటా  తిరుమల తిరుపతి దేవస్థానాల వారి బడ్జెట్లో ఒక్క శాతం..  అంటే సుమారుగా 50 కోట్ల రూపాయలు కేటాయించడానికి..  భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి నిర్ణయించగా,  ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. 

 మరికొన్ని నెలల్లో ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో..  దేవుడి సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటూ..  హిందూ ఓటర్లలో వ్యతిరేకతను పెంచుకోవడం జగన్ కు ఇష్టం లేదని అర్థమవుతుంది.  భూముల కరుణాకర్ రెడ్డి..  ప్రభువు మనసెరిగి ప్రవర్తించే బంటు లాగా.. జగన్మోహన్ రెడ్డి నుంచి గానీ,  ఏపీ ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి విజ్ఞప్తి లేకపోయినప్పటికీ..  టిటిడి డబ్బులు ప్రభుత్వానికి దాఖలుపరిచే నిర్ణయం తీసుకున్నారు.  తద్వారా తిరుపతి అసెంబ్లీ ఎన్నికల బరిలో తన కొడుకు అభినయ రెడ్డి విజయానికి,  దేవుడి డబ్బులతో రాచబాట వేయవచ్చు అని అనుకున్నాం.  కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. 

 జగన్మోహన్ రెడ్డి కూడా టీటీడీ నిధులను ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడానికి గతంలో ఆలోచన చేసిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది.  బాండ్ల రూపంలో వీటిని వాడుకోవాలని ప్రయత్నించి వెనక్కు తగ్గారు.  అసలు బాండ్ల అవసరం కూడా లేకుండా గంపగుత్తగా కోట్లు ఇచ్చేయడానికి..  భూమన ఏకంగా నిర్ణయం తీసుకున్నారు. 

 ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించడం వరకు బాగుంది. . అంతమాత్రాన టీటీడీ నిధులను ప్రభుత్వం వాడుకోవడం లేదని అనడానికి వీల్లేదు.  టిటిడి భవనాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంగా వాడుకుంటూ ఇప్పటిదాకా అద్దె చెల్లించలేదని సంగతిని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.  హిందూ  ఓటర్లలో వ్యతిరేకత రాకూడదు అని అనుకుంటే గనుక..  ఇలాంటి చాటుమాటు మార్గాలలో టీటీడీ నిధులను దోచుకోవడాన్ని కూడా మానేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles