జగన్ చర్యలు.. తల్లి వక్షోజాలు కోసేసినట్టుగా..

Sunday, December 22, 2024

ఇదేదో రాజకీయ విమర్శ కాదు. రాజకీయం కోసం జగన్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న వారు.. ఆయనను బద్నాం చేయడానికి అన్నమాట కాదు! నిత్యం ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే పోరాడే మనిషిగా పేరున్న వ్యక్తి.. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని గమనించి కడుపుమండి అన్నటు వంటి మాట. ఏ వ్యక్తి అభిప్రాయాలైతే అద్భుతం అని గతంలో జగన్ కూడా కీర్తించారో.. అదే వ్యక్తి ఇవాళ జగన్ పాలనను గమనించి.. నిస్పృహతో అన్నమాట. విశాఖలో రుషికొండ విధ్వంసం అనేది.. తల్లి వక్షోజాలను కోసేస్తున్నట్టుగా ఉన్నదని.. ప్రముఖ సామాజిక కార్యకర్త రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. 

 ఈ ప్రభుత్వం చేస్తున్నది క్షమించరాని నేరం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

రాజమహేంద్రవరంలో గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఓ బహిరంగ సభ జరిగింది. నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని రాజేంద్రసింగ్ పిలుపు ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే ఆయేన వచ్చారు. 

అయితే ఈ సందర్భంగా విశాఖలో వేంకటేశ్వరస్వామి కొండ మీద నుంచి.. రుషికొండ వద్ద జరుగుతున్న పనులను కూడా రాజేంద్రసింగ్ పరిశీలించారు. రుషికొండపై సాగిస్తున్న విధ్వంసాన్ని గమనించి ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రం ఒడ్డున ఉన్న రుషికొండను ఈ విధంగా ధ్వంసం చేయాలని ఎలా అనిపించిందో అర్థం కావడం లేదని వాపోయారు. విశాఖకు సముద్రం తల్లి లాంటిదైతే.. రుషికొండ పాలిచ్చే వక్షోజం లాంటిదని.. ఇక్కడ తవ్వకాలను, విధ్వంసాన్ని గమనిస్తే.. తల్లి వక్షోజాలను కోసేస్తున్నట్టుగా కనిపిస్తోందని.. ఇది క్షమించరాని నేరమని .. రాజేంద్రసింగ్ అన్నారు. 

గతంలో చంద్రబాబునాయుడు కృష్ణా నదీ తీరంలో ఇంటిలోఉన్నప్పుడు కూడా రాజేంద్రసింగ్ విమర్శలు చేశారు. అప్పటి తమ మాటలను శెభాష్ అన్న వ్యక్తి జగన్, తాను సీఎం అయ్యాక ఎందుకిలా చేస్తున్నారో తెలియడం లేదని రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

విశాఖ రుషికొండలో.. ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా విధ్వంసానికి పాల్పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. ఇక్కడ సెక్రటేరియేట్ ఏర్పాటుచేయడానికి వీలుగా నిర్మాణాలు చేస్తున్నారనేది ప్రజాబాహుళ్యంలో ఉన్న ప్రచారం. అయితే ఇది టూరిజం ప్రాజెక్టు అని ప్రభుత్వం కబుర్లుచెబుతోంది. ఏ క్షణాన్నయినా సరే.. ఈ నిర్మాణాలను సెక్రటేరియేట్ కు అనువుగా మార్చుకోవడానికి వీలుగా అధికంగా డార్మెటరీలు వంటివి కడుతున్నట్లు తెలుస్తోంది. రుషికొండలోజరుగుతున్న పనులను ప్రతిపక్షాల వారు కనీసం చూడడానికి కూడా వీల్లేదన్నట్టుగా విపరీతమైన పోలీసు సెక్యూరిటీ మధ్య చేయిస్తున్నారు. గోప్యత పాటించే కొద్దీ.. రుషికొండ విధ్వంసంపై ప్రజల్లో అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles