కార్యకర్తలను కాపాడడం అంటే ఇదేనా సజ్జలా?

Thursday, December 19, 2024

మీరు మీపాటికి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉండండి. మిమ్మల్ని పార్టీ కాపాడుతుంది. మీపై కేసులు నమోదు అయితే.. కాపాడడానికి మీ తరఫున వాదించడానికి ఒక ప్రత్యేకమైన లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ కూడా ఉంటుంది. వారు నిరంతరాయంగా మీకు సేవలు సలహాలు అందిస్తుంటారు. స్థానిక న్యాయవాదులు మిమ్మల్ని కాపాడుతుంటారు.. అని రకరకాలుగా పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టడానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే.. ఎవరైతే సాలిడ్ సాక్ష్యాధారాలతో దొరికిపోతారో.. వారిని పార్టీ వదిలించుకునేలా కనిపిస్తోంది.

ఎన్డీయే ప్ర,భుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించాక వైసీపీ నేతలకు వణుకు వస్తోంది. వైసీపీకి చెందిన సోషల్ సైకోల మీద వరుస కేసులు నమోదు అవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయితే.. ఈ అరెస్టుల పర్వం మొదలు కాగానే.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఉన్మాదులను మరింత రెచ్చిపోవాల్సిందిగా ఆయన సూచించారు.

అందుకు తగినట్టుగా మార్గదర్శనం చేశారు. స్థానికంగా మీమీద కేసులు నమోదైనప్పుడు మన పార్టీకి చెందిన. న్యాయవాదులు మీకు సాయం చేస్తారు అని చెప్పారు. అంటే బహుశా.. జగనన్న పాలన కాలంలో.. ప్రభుత్వం నెలనెలా పెన్షను ఇచ్చినట్టుగా సొమ్ములు పంచిపెట్టిన న్యాయవాదుల గురించే కావొచ్చు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో 24X7 కార్యకర్తలకు న్యాయసాయం అందించడానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటుచేస్తున్నాం అని కూడా చెప్పారు. కాబట్టి నిర్భయంగా మీ పోస్టులు మీరు పెట్టండి.. అని రెచ్చగొట్టారు. తీరా ఇప్పుడు కేసుల్లో పీకల్దాకా కూరుకుపోయిన కార్యకర్తలను గాలికి వదిలేస్తున్నారు. వారు ఎలాచచ్చినా పర్లేదనుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియా అసభ్యత కేసుల్లో పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి, అలాగే బెదిరింపుల దందాలు ప్లస్ సోషల్ మీడియా అసభ్యత కేసుల్లో  గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పార్టీకి కీలక కార్యకర్తలే. అయితే వీరితో తమ పార్టీకి సంబంధం లేదంటూ.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేశారు. కేసుల్లో ఉన్న కార్యకర్తలను కాపాడడం అంటే ఇదేనా సజ్జలా అని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles