జగనన్న 2.0 లో హోం మంత్రి కిలేడీనేనా?

Thursday, December 4, 2025

జగనన్న సలహాదారుగా ఆయన పాలన కాలంలో ఒక వెలుగువెలిగిన రౌడీషీటర్, ప్రభుత్వం ద్వారా గన్ మెన్ ను తీసుకుని, గన్ మెన్ వెంటబెట్టుకుని వెళ్లి.. హత్యలు చేస్తానంటూ చర్చిఫాదర్లను బెదిరించి దందాలు సాగించిన వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సదరు రౌడీషీటరును పోలీసులు అరెస్టు చేస్తే.. జగన్ తనకు చాలా క్లోజ్ అంటూ స్టేషన్ లో కూర్చుని పోలీసులతో సపర్యలు చేయించుకున్న వైనం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా అంతకంటె ఘాటైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరుకు చెందిన కిలేడీడాన్ అరుణను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె అంతకంటె చిత్రమైన సమాధానాలు చెప్పారు.

రాబోయే ప్రభుత్వంలో తాను హోంమంత్రిని అవుతానని, తనకు కోపరేట్ చేస్తే మీకు కావాల్సిన చోట్ల పోస్టింగులు వేయిస్తానని ఆమె విచారణాధికారులకే ఆఫర్లు పెట్టడం విశేషం. దీంతో వారే నివ్వెరపోయే పరిస్థితి.

వివరాల్లోకి వెళితే.. ఒక బిల్డర్ ను బెదిరించిన కేసులో లేడీడాన్ అరుణను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే ఆమె పోలీసుల విచారణలో అనేకానేక పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ను జైలునుంచి విడుదల చేయించి.. ఎక్కడికైనా వెళ్లిపోయి బతకాలని అనుకున్నామని, వచ్చే ఎన్నికలకు ముందు వచ్చి గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి హోంమంత్రి అవుదామని అనుకున్నట్టుగా వారితో అన్నది. తెదేపా, వైసీపీ రెండు పార్టీల్లోను తనకంటె బాగా మాట్లాడే మహిళనాయకురాళ్లు లేరని అనడం విశేషం.

అయితే ఆమె చరిత్రను గమనిస్తే వైసీపీతో ఆమె అనుబంధం చాలా గాఢమైనదని అర్థమవుతుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆమె మహిళలకు కౌన్సెలింగ్ చేసే దిశ ఫౌండేషన్ నడిపారు. దిశపోలీసు స్టేషన్ లకు అనుబంధంగా కౌన్సిలర్ గా ఆమెకు పోలీసులు ప్రత్యేకహోదా కల్పించారు. అలాగే వైసీపీ జమానాలో ఆమెకు తెల్ల రేషన్ కార్డు కూడా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆమె తెల్ల రేషన్ కార్డును రద్దు చేశారు.

అలాగే శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించుకోవడంలో కూడా.. వైసీపీ జమానాలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో ఇప్పించుకోగలిగింది గానీ.. తెలుగుదేశం హయాంలో ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలిచ్చినా పనికాలేదు. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తే.. జగనన్న 2.0 ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. తానే హోం మంత్రి అవుతానని.. అప్పుడు ఈ పోలీసులందరినీ ఒక ఆట ఆడిస్తానని లేడీ డాన్ అరుణ కలగంటున్నట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles