మిడిల్ లెవెల్ నేతల వంతు వచ్చిందా?

Wednesday, December 18, 2024
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకుల మీద ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన వారికి, తప్పుడు మాటలతో సోషల్ మీడియా పోస్టులు పెడుతూ చెలరేగిపోయిన వారికి ఇప్పుడు అరదండాలు పడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్యకర్తల మీద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. వందలమందికి పోలీసులు 41ఏ నోటీసులు సర్వ్ చేశారు. ఈ కేసుల పర్వం ఇప్పుడు రెండో అంకానికి చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

ఒకస్థాయికి మించిన నాయకుల మీద తాజాగా కేసులు నమోదు కావడం ప్రారంభం అయింది. ఇలాంటి సోషల్ మీడియా ముసుగులోని తప్పుడు పోస్టుల వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ మాటలు కార్యరూపంలోకి వస్తున్నాయా? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్షార్ కాంగ్రెస్ పార్టీలో బూతులు మాట్లాడడానికి పేటెంటు ఉన్న జగనన్నకు ప్రియమైన నేత కొడాలి నానికి, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దీక్షలు, నిరసనలు శాంతియుతంగా చేస్తున్నప్పుడు.. వారి మీదకు వెళ్లి నానా దుర్భాషలాడి వివాదంలోః ఇరుక్కున్న గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఈ ఇద్దరు నాయకుల మీద వేర్వేరు వ్యక్తుల ఇచ్చిన ఫిర్యాదులను బట్టి అటు విశాఖ, ఇటు గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.

మాజీ మంత్రి కొడాలి నాని మీద ఆంధ్రా యూనివర్సిటీలోని లా చదువుతున్న అమ్మాయి ఫిర్యాదు చేసింది. అలాగే గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు.. గతంలో తెదేపా- జనసేన నేతలు నిరసన నిర్వహిస్తుండగా.. వారి మీదకు దాదాపుగా దాడికి వెళ్లారు. పోలీసుల లాఠీని తన చేతిలోకి లాక్కుని జనసేన నేతలపై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై అప్పట్లోనే ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

కూటమి  ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా తెదేపా నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో  కావటి మనోహర్ మీద కేసు నమోదు అయింది. ఈ పరిణామాలలో అత్యంత కీలకమైన అప్డేట్ ఏమిటంటే.. రెండు మూడు రోజుల వ్యవధిలో పులివెందుల నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి చెబుతున్న మాటలను అనుసరించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles