అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేసరికి.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకల్పన పరంగా ఎంతటి అధోగతికి వెళ్లిపోయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉన్న పరిశ్రమలను కూడా రకరకాలుగా వేధించి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేస్తూ.. కొత్త పరిశ్రమలు రావాలంటేనే భయపడేలా వారిని వాటాలకోసం డిమాండ్ చేస్తూ జగన్ ఎలాంటి దుర్మార్గమైన పరిపాలన అందించారో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో అధికార బదలాయింపు జరుగుతుందని.. తెలుగుదేశం అధికారంలోకి రానున్నదని సంకేతాలు వస్తుండడంతో.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు సిద్ధం అవుతున్నారు. ప్రత్యేకించి ఎన్నారై పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు.
ఎన్నారై పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీకి ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి కూడా అయిన మండవ మోహన క్రిష్ణ సోమవారం ఎన్టీఆర్ ఫౌండేషన్ కు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే మరో ఎన్నారై బొద్దులూరి కృష్ణ కూడా 25 లక్షల విరాళం పార్టీకి అందించారు.
ఈ సందర్భంగా.. వారితో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఎన్నారైలు పెద్దస్థాయిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర యువతకు ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని కోరినట్టు సమాచారం. దీనికి ఎన్నారైలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో స్థిరమైన రాజధాని నిర్మాణం అవుతుందని, రాష్ట్రంలోని పరిస్థితులకు కూడా ఒక స్థిరత్వం వస్తుందని అనేకమంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాంటి వారంతా కూడా.. బాబు ప్రభుత్వం ఏర్పడగానే పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబునాయుడు చారిత్రాత్మక పాలన అందించే దిశగా అడుగులు వేయబోతున్నారని పలువురు అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోను వంటి వాటి విషయంలో జగన్ సర్కారు అయిదేళ్లలో ఒక్కఅడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కనీసం రైల్వేజోను కు స్థలం కూడా ఇవ్వలేదు. కానీ వీటన్నింటినీ కూడా రాబోయే అయిదేళ్లలో ఒక కొలిక్కి తీసుకువచ్చి, పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా అందించడం ద్వారా.. చంద్రబాబునాయుడు తన పరిపాలన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారనే ఆశలు ప్రజల్లో ఉన్నాయి.
బాబు వస్తే చాలు : సిద్ధమౌతున్న పెట్టుడులు!
Wednesday, January 22, 2025