అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దితే..పదివేలిస్తా: రాజమౌళి!

Saturday, January 18, 2025

టాలీవుడ్ యంగ్‌ హీరో సత్యదేవ్‌ తాజాగా నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌ కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్‌ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సినిమాని యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాని వీవీ గోపాలకృష్ణ డైరెక్షన్‌ చేస్తున్నారు.

 తాజాగా జరిగిన కృష్ణమ్మ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి,   డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ జరిగింది. దర్శక ధీరుడు జక్కన్న తన తరువాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది .  ఆ సినిమా ఓపెనింగ్ ఎప్పుడో జక్కన్న చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు. అలాగే దేవర సినిమా గురించి అప్డేట్ కావాలని దర్శకుడు కొరటాల శివను కూడా అడిగారు.

అయితే రాజమౌళి గురించి మాట్లాడుతూ…ఆయన ఓపెనింగ్ డే రోజున తాను తీసే సినిమా కథ ఎలా ఉంటుంది ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనేది చెబుతారు. తరువాత సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని అనిల్ రావిపూడి అన్నారు.దీ నితో రాజమౌళి సరదాగా స్పందించారు.. దర్శకుడు అనిల్ రావిపూడిని ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని..ఆయన వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు ఆయన మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు బహుమతి ఇస్తానని” అని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి సరదాగా స్పందించారు. “దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. 10వేలు అంటే నిజంగా వచ్చేస్తారు” అని అనిల్ సరదాగా వ్యాఖ్యానించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles