ఆయన ప్రశంస ఎంతో ప్రత్యేకం!

Wednesday, January 8, 2025

ఈ ఏడాది ప్రారంభంలోనే హనుమాన్‌ తో సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. యంగ్‌ హీరో తేజ సజ్జా. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలో తేజ నగన పై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే అందరికంటే బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ ప్రశంస తనకెంతో ప్రత్యేకమని తేజ తెలిపారు.

ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. 2024 చివరకు వచ్చింది. ఈ ఏడాది నేను అందుకున్న గొప్ప ప్రశంసగురించి చెప్పాలని చాలా మంది అడిగారు. నిజాయితీగా చెప్పాలంటే రణ్‌వీర్ ప్రశంసంస నన్ను కదిలించింది.ఎంతో పర్సనల్‌ గా అనిపించింది.

అందుకే ఇన్ని రోజులు ఎవరికీ వెల్లడించకుండా మనసులోనే దాచుకున్నా. ఆయన నా వర్క్‌ గురించి మాట్లాడిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. ఎంతో ప్రేమ చూపారు. చిన్న విషయాలను కూడా గమనించి ప్రోత్సహించారు. అది కేవలం ప్రశంస మాత్రమే కాదు.

స్వచ్ఛమైన ప్రోత్సాహం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా హృదయం నుంచి వచ్చిందే అని ఎక్స్‌ లో తెలియజేశారు. తన కెరీర్‌ ను మరింత ప్రత్యేకం చేసినందుకు రణ్‌వీర్‌ కు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles