ఆ రూమర్స్ లో ఏం నిజం లేదు!

Thursday, December 5, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ,  అందాల ముద్దుగుమ్మ అంజలి ఫీమేల్ లీడ్ లో మావెరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించి మోస్ట్ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్”.  ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కో పాట మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

అయితే ఈ సినిమా విషయంలో తాజాగా పలు రూమర్స్ పై ఓ క్లారిటీ వినిపిస్తుంది. నిజానికి గేమ్ ఛేంజర్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతకీ పూర్తి కాకుండా అలా జరుగుతూనే ఉన్న నేపథ్యంలో రెండు భాగాలుగా ఏమన్నా తీస్తున్నారా అంటూ ఆ మధ్య ఓ క్రేజీ టాక్‌ కూడా వినిపించింది.

ఇపుడు మళ్ళీ ఇవే ఊహాగానాలు వినిపిస్తుండగా ఇపుడు ఫైనల్ గా దీనిపై అయితే తాజాగా మరో క్లారిటీ వినపడుతుంది. ఈ సినిమాకి పార్ట్ 2 ఉండడమో లేదా శంకర్ గతంలో తెరకెక్కించిన సినిమాకి సీక్వెల్ కాన్సెప్ట్ లానో రావడం లేదని తెలుస్తుంది. ఇది పూర్తిగా సోలో సినిమా దీనికి ఎలాంటి సీక్వెల్ ఉండదని వివరించారు. దీంతో సీక్వెల్‌  వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles