తన చేతికి పాలనాధికారం దక్కితే అయిదేళ్లపాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రానికి రుచిచూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిన ప్రతిసందర్భంలోనూ అచ్చంగా సైంధవుడి మాదిరిగా ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతూ ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతే. 2014-19 మధ్య కాలంలో కూడా రాష్ట్రప్రభుత్వం అప్పులకోసం ప్రయత్నిస్తున్న సందర్భాల్లోను, పెట్టుబడులకోసం ప్రయత్నిస్తున్న సందర్భాల్లోనూ జగన్ దళాలు ఎన్నెన్ని సైంధవ వేషాలు వేశాయో అందరికీ తెలెుసు.
ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు 4.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా.. ప్రభుత్వం సంకల్పిస్తున్న పనులు ముందుకు వెళ్లకుండా చూడడానికి ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రుణాలు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయడం, పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి రాకుండా బెదిరిస్తూ 200కు పైగా మెయిళ్లు పంపడం వంటి దుర్మార్గాలకు వారు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు విఫలం అవుతున్న సైంధవ పాత్రను పోషిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా చూసేందుకు.. పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీల విషయంలో దాఖలైన ఒక పిల్ ను విచారిస్తూ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
వివరాల్లోకి వెళితే..
విశాఖలో టీసీఎస్ కు చేసిన భూ కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని పిటిషన్ దారునే ప్రశ్నించడం విశేషం. కంపెనీల రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి కదా. అని వ్యాఖ్యానించింది. ‘రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. టీసీఎస్ ను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించి ఉండొచ్చు. ఎంత రేటుతో కేటాయిస్తున్నారనేది కాదు.. ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి. టీసీఎస్ 1370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. ఐటీ వృద్ధితో హైదరాబాదు, బెంగుళూరు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించడం నిజంగా.. పిటిషన్ దారుకు చెంపపెట్టు లాంటి వ్యాఖ్యలే.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సైంధవ దళాలే తెరవెనుకనుంచి ఇలాంటి పిటిషన్లు వేయించడం.. బెయిళ్లు పెట్టడం, పనులకు అడ్డుపడడం చేస్తుంటారని ప్రజలకు నిశ్చితాభిప్రాయం ఏర్పడుతోంది. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది వస్తున్న ప్రాజెక్టులను కూడా వెళ్లగొట్టడానికి జగన్ దళాలు చేస్తున్న కుట్రలను, కోర్టుల్లో వేస్తున్న కేసులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
