మొదలుపెట్టేశాడు..!

Thursday, January 2, 2025

తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా ‘కంగువా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేశాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని సూర్య డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే, సూర్య ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టును కూడా మొదలు పెట్టేశాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ డైరెక్షన్‌ లో సూర్య తన కెరీర్‌లోని 45వ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టారు.

ఈ పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు . ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles