అదిరిపోయే సర్‌ప్రైజ్‌

Thursday, December 5, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా మేనియాతో ప్రస్తుతం సినీ లవర్స్ ఊర్రూతలుగుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా మూవీ శరవేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్. అయితే, తాజాగా కేరళలో జరుగుతున్న ఈ చిత్ర ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొని, కేరళ ఆడియెన్స్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఈ సినిమాలోని నెక్స్ట్ సింగిల్ సాంగ్‌గా ‘పీలింగ్స్’ అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన తెలిపాడు. ఈ పాట మలయాళంలో స్టార్ట్ అవుతుందని.. అన్ని భాషల్లోనూ మలయాళం పదాలు స్టార్టింగ్ కోసం వాడినట్లుగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా మలయాళం ఆడియెన్స్‌పై తనకున్న అభిమానాన్ని బన్నీ ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు. ఇక ఈ పాటలో రష్మిక డ్యాన్స్ చూసి ఆమెను క్రష్మిక అంటూ పిలుస్తారని బన్నీ చాలా ధీమాగా ఉన్నాడు. ఇలా పుష్ప-2 నుండి ‘పీలింగ్స్’ అంటూ ఇచ్చిన సర్‌ప్రైజ్ అదిరిపోయిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles