ఈ వెరైటీ దొంగ ట్రైలర్‌ ను చూశారా!

Friday, March 14, 2025

టాలీవుడ్ హీరో ఆనంద్‌ దేవరకొండ రీసెంట్‌ గా  బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్‌ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్‌ గా  నటిస్తుంది. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

మొన్న ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై హైప్ ను పెంచేందుకు మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తన పంచ్ డైలాగులతో ట్రైలర్ మొదలవుతుంది. అమ్మాయిలకు వల విసురుతూ అబద్దాలు చెబుతూ హీరో కనిపిస్తాడు.

 యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ను చూపిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు… ఒక దొంగగా ఉన్న ఉన్న అతని జీవితం చివరికి ఎలా మలుపు తిరుగుతుందో చూపించారు… ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

అయితే గం గం గణేశా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం. మే 31వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆ రోజున భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles